తెలంగాణలో ఇంటర్ అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | Telangana Outsourcing Jobs 2025
Telangana Outsourcing Jobs 2025:
తెలంగాణాలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుండి కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి మొత్తం 05పోస్టులతో మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, పారా మెడిక్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్,MLT, DMLT, BSC MLT, GNM, BSC నర్సింగ్, Mbbs చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే అర్హతలాల్ వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం కలిగిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అవుట్ సోర్సింగ్ జాబ్స్ ముఖ్యమైన తేదీలు:
మంచిరియాల్ జిల్లా నుండి కాంట్రాక్టు విధానంలో విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15th మార్చి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 19th మార్చి 2025
అప్లికేషన్ పంపిoచవలసిన అడ్రస్ : జిల్లా హెల్త్ సొసైటీ, మంచిరియల్ డిస్ట్రిక్ట్, తెలంగాణా ప్రభుత్వం.
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు విచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
తెలంగాణా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ లో పని చేయడానికి అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అవుట్ సోర్సింగ్ జాబ్స్ అర్హతలు:
తెలంగాణా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసేందుకుగానూ మంచిరియాల్ జిల్లాలోని జిల్లా హెల్త్ సొసైటీ నుండి 05 పోస్టులతో పారా మెడికల్ కమ్ అసిస్టెంట్, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నాషియన్, నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, MLT, DMLT, BSC MLT, GNM, BSC నర్సింగ్, MBBS అర్హతలు కలిగి ఉండాలి.
శాలరీ వివరాలు:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి, ₹52,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు. ట్రావెలింగ్ అల్లఓన్సెస్, HRA, DA వంటి అన్ని రకాల సకల సౌకర్యాలు ఉంటాయి.
ఉండవలసిన సర్టిఫికెట్స్ వివరాలు:
SSC, / డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, 10+2 అర్హత సర్టిఫికెట్స్, క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్స్, అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోలు, కౌన్సిల్స్ కి సంబందించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, కమ్యూనిటీ, క్యాస్ట్ సర్టిఫికెట్స్, EWS సర్టిఫికెట్స్, 1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. అలాగే రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Ex సర్వీస్ మెన్ సర్టిఫికెట్స్, PWD అభ్యర్థుల సదరం సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ లోని అర్హతలు వయస్సు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.