SBI లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు | Latest SBI Clerk Notification 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్ ( క్లర్క్ ) విభాగంలో భారీగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి SBI బ్యాంక్ వారు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా SBI బ్యాంక్ లో జూనియర్ అసోసియేట్ ( క్లర్క్ ) విభాగంలో మొత్తం 50 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జనరల్ : 23
EWS : 05
OBC : 13
SC : 04
ST : 02
మొత్తం : 50
విద్య అర్హతలు :
Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు మినిమం 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి అంటే మీరు 02/04/1996 నుండి 01/04/2004 మధ్య పుట్టి ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, PWD వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ / OBC / EWS వారు 750 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగతావారు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫీజు Online లో మాత్రమే చెల్లించాలి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు SBI బ్యాంక్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే సమయంలో అడిగిన డిటైల్స్ నీ ఫిల్ చేసి అవసరం అయిన సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి SBI బ్యాంక్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఈ రాత పరీక్ష 2 స్టేజస్ లో ఉంటుంది. మొదటి సారి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష క్వాలిఫై అయిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
పరీక్ష విధానం & సిలబస్ :
ప్రిలిమినరీ పరీక్ష లో 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష కు సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష కు మొత్తం 60 నిమిషాలు సమయం ఇస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 50 ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల 40 నిమిషాలు సమయం ఇస్తారు.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు బేసిక్ 26,730 రూపాయలతో పాటు అల్లోవాన్స్ వర్తిస్తాయి.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 27/12/2024
Official Notification : Click Here