పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండానే డైరెక్ట్ ఉద్యోగాలు | Postal IPPB Executive Jobs Notification 2025
Postal IPPB Notification 2025:
కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 51 ఎగ్జిక్యూటివ్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. వచ్చిన అప్లికేషన్స్ ఆధారంగా అభ్యర్థులకు పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సంబందించిన రాష్ట్రాలలో పోస్టింగ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు 03 సంవత్సరాలు కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యాలి. కావున రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి గడువు ముగిసేలోగా అప్లికేషన్ పెట్టుకోగలరు.
పోస్టల్ ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే ప్రారంభ తేదీ : 1st మార్చి 2025
ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ఆఖరు తేదీ : 21st మార్చి 2025
ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసే అభ్యర్థులలో SC, ST, PWD వారు ₹150/- ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇతర వేరే విధానంలో Apply చేసినవారి దరఖాస్తులు అంగీకరించబడవు.
ఎంత వయో పరిమితి కలిగి ఉండాలి:
21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం IPPB డిపార్ట్మెంట్ వారు కల్పిస్తున్నారు. రిజర్వేషన్ ఉన్న SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితి మినహాయింపు ఉంటుంది.
IPPB పోస్టల్ ఉద్యోగాల అర్హతలు:
ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి కాంట్రాక్టు విధానంలో వర్క్ చేయడానికి 51 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను రాష్ట్రాల వారీగా ఖాళీలతో విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 03 సంవత్సరాలపాటు కాంట్రాక్టు విధానంలో సెలెక్ట్ అయినవారు పని చెయ్యాలి.
ఎంపిక ఎలా చేస్తారు:
Ippb పోస్టల్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ఉండదు. కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఇస్తారు. ఎక్కువ అప్లికేషన్స్ వచ్చిన సందర్బంలో ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
శాలరీ ఎంత ఉంటుంది:
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర ట్రావెల్ అలవెన్సులు, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్:
రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో: 20kb నుండి 50kb మధు సైజ్ ఉండే విధంగా స్కాన్ చేసి ఉండాలి.
Signature/సంతకం : 10kb నుండి 20kb సైజ్ ఉండే విధంగా స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి
అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫారం కూడా అప్లోడ్ చెయ్యాలి.
పోస్టల్ శాఖ ippb ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హత ఉన్నట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఆన్లైన్ లో నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.