Central Govt Jobs

10వ తరగతి తో రైల్వే లో 1154 ఉద్యోగాలు | Latest RRB Notification 2025 | Railway Jobs In Telugu

రైల్వే డిపార్ట్మెంట్ గ్రూప్ – డి నోటిఫికేషన్ ద్వారా భారీగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. రైల్వే డిపార్ట్మెంట్ గ్రూప్ – డి తో పాటు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేశారు. ఇందులో మొత్తం 1,154 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు కేవలం 10th / 10+2 / ITI పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి. అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, రిఫ్రిగిరేషన్ & AC మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ మరియు వైర్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ జాబ్స్ నీ దేశం లో ఉన్నటువంటి వివిధ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని డివిజన్స్ లో మొత్తం 1,154 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోగలరు.

వయస్సు :

01.01.2025 నాటికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు అప్లై చేసుకోగలరు. అలానే కొన్ని క్యాస్ట్ లో వారికి గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇస్తుంది. SC / ST వారికి 05 సంవత్సరాలు OBC వారికి 03 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు :

అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు గా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు నీ రైల్వే అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే చెల్లించాలి.

అప్లికేషన్ ప్రాసెస్ :

Apply చేసుకునే వారు వారి మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం నీ స్కాన్ చేసి ఉంచుకోవాలి. రైల్వే అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ ఇచ్చి స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అడిగిన ప్లేస్ లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ & జీతం :

రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. అప్లికేషన్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. జాబ్ లో జాయిన్ అయిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది :

ఈ 1,154 ఉద్యోగాలు దేశం లో ఉన్నటువంటి వివిధ డివిజన్ లో ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారికి ఆ లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 25/01/2025
Apply చేయడానికి చివరి తేది : 14/02/2025

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *