Income Tax డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Income Tax Dept. Notification 2025
Income Tax Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ డిపార్ట్మెంట్ సంస్థ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి 56 పోస్టులతో స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 17 రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఒక విభాగంలో అర్హత కలిగి ఉండాలి. రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ అర్హతలు, విద్యార్హతలు ఆధారంగా ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూడండి.
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ జాబ్స్ ముఖ్యమైన తేదీలు:
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకునే ఆఖరు తేదీ : 5th ఏప్రిల్ 2025. ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లేదు. అలా చేసినవారి దరఖాస్తులు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ లో తెలిపిన దరఖాస్తు రుసుమును వారు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు
ఎంత వయస్సు ఉండాలి:
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులము 18 నుండి 25 సంవత్సరాలు లేదా 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయో పరిమితిలో 03 నుండి 05 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
ఉద్యోగాలు ఎన్ని, వాటి అర్హతలు ఏమిటి?:
క్రీడా విభాగాల్లో అర్హతలు కలిగి సర్టిఫికెట్స్ ఉన్న అభ్యర్థులకోసం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి 56 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలున్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక ఎలా చేస్తారంటే?:
ఇన్కమ్ టాక్స్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకున్నవారికి ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు కలిగి Top 3 లో ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. ట్రయిల్ టెస్ట్ లో అర్హత పొందిన వారికి డిపార్ట్మెంట్ లో జాబ్ పోస్టింగ్ ఇస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ఇన్కమ్ టాక్స్ పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు MTS పోస్టులకు నెలకు ₹30,000/- శాలరీ మిగిలిన టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు నెలకి ₹50,000/- శాలరీ ఉంటుంది.ఇతర TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:
10వ తరగతి / SSC మార్క్స్ లిస్ట్, వయో పరిమితి గురించి తెలిపే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, 10th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ లేదా గేమ్స్ అర్హతల సర్టిఫికెట్స్, sc,st, obc కమ్యూనిటీ సర్టిఫికెట్స్, వాలిడ్ Id ప్రూఫ్ ఉండాలి.
నోటిఫికేషన్ లో తెలిపిన అర్హతలున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం, రిక్రూట్మెంట్ నోటీస్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ గడువులోగా సబ్మిట్ చేసుకోగలరు.