ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గవర్నమెంట్ జాబ్స్ విడుదల | AP High Court Jobs Notification 2025
AP High Court Govt Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలి అనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిపార్ట్మెంట్ నుండి 14 ఎంట్రీ లెవెల్ జిల్లా జడ్జి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లా డిగ్రీ చేసి 7 సంవత్సరాలు లాయర్ గా ప్రాక్టీస్ చేసి 1st మార్చి 2025 నాటికీ 35 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి తర్వాత 50 మార్కులకు వైవ వొస్ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయినవారిని ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. హైకోర్టు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడండి.
అప్లికేషన్ పెట్టుకునే ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగాలకు ఈ క్రింది తెలుపబడిన తేదీలలోగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి.
ఆఫ్ లైన్ విధానంలో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని 27th మార్చి, 2025 తేదీలోగా ది చీఫ్ సెక్రటరీ టూ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, (SCF) డిపార్ట్మెంట్, సెక్రటేరియట్ బిల్డింగ్, వెలగపూడి, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ : 522238, ఆంధ్రప్రదేశ్.
ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏమిటి?:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభాగం నుండి 14 జిల్లా కోర్టు జడ్జి పోస్టులను రిక్రూట్మెంట్ చేయడంకోసం ఏపీ హైకోర్టు వారు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవన్నీ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలె. అన్ని జిల్లాల అభ్యర్థులె కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు లా డిగ్రీ చేసి 7 సంవత్సరాలు అడ్వైకేట్ గా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉన్నట్లయితే Apply చేయడానికి అర్హులు.
ఎంత వయో పరిమితి ఉండాలి:
హైకోర్టు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. Sc, st, obc, ews అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు:
హైకోర్టు జిల్లా కోర్టు జడ్జి పోస్టులకు దరఖాస్తులు పెట్టుకున్నవారికి 100 మార్కులతో రాత పరీక్ష పెడతారు. అందులో క్రిమినల్ లా, సివిల్ లా తో పాటు, ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. పరీక్షలో అర్హత పొందినవారికి 50 మార్కులకు వైవ వొస్ ఉంటుంది.
దరఖాస్తు రుసుము ఎంత?:
జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు OC, OBC, EWS వారికి ₹15,000/-, SC, ST అభ్యర్థులకు ₹800/- ఫీజు ఉంటుంది. రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ తో పాటు పంపించవలెను.
ఎంత శాలరీ చెల్లిస్తారు:
డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:
లా డిగ్రీ సర్టిఫికెట్స్, వయస్సు గురించి తెలిపే సర్టిఫికెట్స్, కాస్ట్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నిర్నీత గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేసుకోవాలి.