Results

AP EAMCET 2025: ఫలితాలు విడుదల తేదీ: రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేష్ ఉన్నత విద్యా మండలి ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్ష ఫలితాలను 14వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో ఇచ్చిన అధికారిక షెడ్యూల్ ప్రకారంగానే ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు కొన్ని Shifts లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. మే 27 మరియు 28 తేదీలలో ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేయడం జరిగింది. మే 30వ తేదీ వరకు విద్యార్థుల నుండి అబ్జెక్షన్స్ ని స్వీకరించారు. ఇప్పుడు ఫలితాన్ని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

  • ముందుగా విద్యార్థులు ఏపీ ఎంసెట్ (AP EAPCET 2025) వెబ్సైట్ ఓపెన్ చెయ్యాలి.
  • వెబ్సైట్ Home Page లో “AP EAMCET 2025 Final Results” ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
  • సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన స్కోర్ కార్డ్, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది
  • అది ప్రింట్ అవుట్ తీసుకొని, కౌన్సిలింగ్ కోసం దాచి పెట్టుకోండి

వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ ఫలితాలను వాట్సాప్ లో కూడా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

  • +9195523 00009 ఈ వాట్సాప్ నంబర్ లో ముందుగా విద్యార్థులు మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకోండి
  • ఆ నంబర్ కు “HI” అని మెసేజ్ చేయండి
  • సేవలను ఎంచుకోండి ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి
  • “AP EAMCET 2025” Results ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే ర్యాంక్ కార్డ్ మీ మొబైల్ లోనే డౌన్లోడ్ అవుతుంది.

ఏపీ ఎంసెట్ ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్స్:

ఈ క్రింద తెలిపిన వెబ్సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను చూసుకోవచ్చు.

డిక్లరేషన్ ఫామ్ లో ఇంటర్ మార్కులు ఎడిట్ చేయండి?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులందరూ జూన్ 5వ తేదీలోగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం లో వారి యొక్క ఇంటర్ మార్కులను సరిచూసుకోవాలి. సబ్జెక్టుల వారిగా మార్కులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని, మార్కులు సరిగ్గా లేనిపక్షంలో వాటిని ఎడిట్ చేసి సబ్మిట్ చేయాలని, ఏపీ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఇంటర్ మార్కుల నుండి 25% వెయిటేజీ మార్కులను ఏపీ ఎంసెట్ ర్యాంక్ లో కలుపుతారు. కావున ప్రతి ఒక్కరూ ఆ మార్కులను ఎడిట్ చేసి మళ్లీ డిక్లరేషన్ ఫారం ని సబ్మిట్ చేయాలని అధికారులు విద్యార్థులకు తెలిపారు.

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన వారం పది రోజుల్లో కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థుల నుండి సర్టిఫికెట్ల పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత విద్యార్థుల నుండి వెబ్ ఆప్షన్స్ తీసుకొని, వారు ఎంచుకున్న కాలేజీలలో సీట్ అల్లొట్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. తరగతులను ఆగస్టు నుండి ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *