AP intermediate supplementary exams 2025 results : release date update
AP Inter supplementary exams 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రాత పరీక్షలు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరైనట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష పత్రాల మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయిన వెంటనే జూన్ మొదటి వారంలోగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవలసి ఉన్నందున, ఫలితాలు త్వరితగతిన విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ ఫలితాలను ఇప్పుడు అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సాప్ లో కూడా చూసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలోని రెగ్యులర్ ఇంటర్మీడియట్ పదో తరగతి, ఇతర అన్ని ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను వాట్సాప్ లోనే చూసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ వాట్స్అప్ గవర్నమెంట్ మనమిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా మీ యొక్క ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల 2025 ఫలితాలను జూన్ 7వ తేదీ నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక తేదీ వెలబడనప్పటికీ, త్వరితగతిన పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు సమాచారం.
వాట్సాప్ ద్వారా ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి?
- ముందుగా విద్యార్థులు వారి యొక్క వాట్సాప్ లో ఏపీ మనమిత్ర సేవలకు సంబంధించిన నెంబర్ +91 95523 00009 సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టండి
- సేవలను ఎంచుకోండి అని ఆప్షన్ పై మీరు క్లిక్ చేయాలి
- ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి
- ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ మరియు రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
- వెంటనే మీకు మార్క్స్ మెమో స్క్రీన్ మీద డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
వెబ్సైట్ ద్వారా ఫలితాలు ఎలా చూసుకోవాలి?
విద్యార్థులు వాట్సాప్ ద్వారానే కాకుండా అధికారిక ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలు చూసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ APBIE Inter Results 2025 ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025″ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
- అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
పైన తెలిపిన విధంగా వాట్సాప్ మరియు ఏపీ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ నుండి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.
FAQ’s:
1. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 కి ఎంతమంది దరఖాస్తు ఫీజులు చెల్లించారు?
ఉన్నటువంటి అధికారికి సమాచారం ప్రకారం 3,46,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది.