Telangana polycet 2025 final results released : download rank card
Telangana polycet 2025 result out:
మొత్తం 98,800 మంది అభ్యర్థులు చాలా రోజుల నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల యొక్క ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను మే 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని SBTET ఆఫీసులో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష మే 13వ తేదీన నిర్వహించారు. మొత్తం 276 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మే 14వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి మే 15వ తేదీ వరకు అబ్జెక్షన్ పెట్టుకోవడానికి సమయం కేటాయించారు. అయితే పరీక్ష జరిగిన పది రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేస్తామని గతంలోనే ఉన్నత విద్యాశాఖ తెలిపింది. చెప్పిన విధంగానే ఇప్పుడు మే 24వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క ఫలితాలను మొబైల్ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు పొందడానికి అర్హత పొందిన వారు అవుతారు. ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Telangana polycet 2025 result date :
తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను మే నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవడం ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
- https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవాలి
- వెబ్ సైట్ ఓపెన్ చేసి హోం పేజ్ లో Telangana polycet 2025 rank card ఆప్షన్ పై క్లిక్ చేసి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
- స్క్రీన్ పైన ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలంగాణ పాలిసెట్ 2025 షెడ్యూల్:
- పాలీసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ :19th మార్చ్, 2025
- అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ : 19th ఏప్రిల్, 2025
- తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష తేదీ : మే 13th, 2025
- ప్రాథమిక కీ విడుదల తేదీ :మే 14,2025
- అబ్జెక్షన్స్ పెట్టుకునే ఆఖరి తేదీ :మే 15, 2025
- ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ :24th మే, 2025
Telangana POLYCET 2025: Official Website
తరచుగా అడిగే ప్రశ్నలు:
1. నాకు తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాల్లో చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది నాకు ఏ కాలేజీలో సీటు వస్తుంది?
ఏ ర్యాంకు వచ్చిన వారి కైనా తెలంగాణలోని ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో సీటు వస్తుంది. మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలి అంటే మీరు డబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
2. తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఫలితాలు విడుదలైన వారం పది రోజుల్లో కౌన్సిలింగ్ నిర్వహించే నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
3. మొత్తం ఎన్ని వేల మంది తెలంగాణ పాలీసెట్ 2025 పరీక్ష రాశారు?
98,800 మందికి పైగా విద్యార్థులు తెలంగాణ పాలిసెట్ రాత పరీక్ష రాశారు.