AP Govt Jobs

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు |AP HM & FW Outsourcing jobs 2025

AP HM & FW Outsourcing jobs:

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్నా హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 43 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఆఫీస్ అబార్డినేట్ ,రికార్డ్ అసిస్టెంట్ ,ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ,ల్యాబ్ అటెండర్, MNO, FNO, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ప్లంబర్ లాంటి చాలా రకాల పోస్ట్లను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డిస్క్రిప్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇస్తారు. అనంతపురం జిల్లాలోని మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ యొక్క అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉద్యోగాల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అంశము వివరాలు
ప్రభుత్వ సంస్థ పేరు ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
మొత్తం పోస్టులు43
వయోపరిమితి18 నుండి 42 సంవత్సరాలు
ఆఖరి తేదీ28th మే, 2025
అధికారిక వెబ్సైట్ (https://ananthapuramu.ap.gov.in)

పోస్టుల వివరాలు :

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • రికార్డ్ అసిస్టెంట్
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్
  • ఆఫీసు సబార్డినేట్
  • ప్లంబర్
  • పోస్టుమార్టం అసిస్టెంట్
  • ల్యాబ్ అటెండర్
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్గ్రేడ్ 2
  • MNO, FNO
  • బయో మెడికల్ ఇంజనీర్, ఇతర పోస్టులు ఉన్నాయి.

అర్హతల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు 10వ తరగతి, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి :

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితిలో స్వరాలింపు ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో ఐదేళ్లపాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం:

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు.

  • అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్
  • మెరిట్ అభ్యర్థుల ఎంపిక
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు ఎంత :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు District Coordinator of Hospital Services Ananthapuramu పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారం తో పాటు పంపించాలి .

  • OC, EWS, BC అభ్యర్థులకు: ₹500/- ఫీజు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: ₹300/- ఫీజు
  • వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎలా అప్లై చేయాలి:

ఏపీ మెడికల్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి

  1. ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పూర్తి చేయాలి
  2. అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్స్ అటాచ్ చేయాలి
  3. సంబంధిత అడ్రస్ కు గడువులోగా అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా పించవలెను.
  4. పంపించవలసిన అడ్రస్ : డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీసెస్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

ముఖ్యమైన తేదీలు :

ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.

  • అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రారంభ తేదీ :21st మే
  • అప్లికేషన్ ఆఖరి తేదీ : 29th మే, 2025
  • ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల తేదీ : 25th జూన్, 2025
  • సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 1st జూలై, 2025

Notification PDF

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *