Central Govt Jobs

DRDO లో 148 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | DRDO scientist-B notification 2025

DRDO scientist B notification 2025:

భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి 148 సైంటిస్ట్ కి ఉద్యోగాన్ని బట్టి చేయడానికి రెగ్యులర్ విధానంలో అధికారికంగా ప్రకటన జారీ చేశారు. మొత్తం 148 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలతో పాటు గెట్ స్కోర్ కూడా కలిగినటువంటి వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ₹56,100/- వరకు జీతాలు చెల్లిస్తారు. గెట్ స్కోర్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. డి ఆర్ డి ఓ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు సంబంధించిన సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:

డి ఆర్ డి ఓ నుంచి విడుదలైన 148 సైంటిస్ట్ బి ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అంశము వివరాలు
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టులు148
పోస్టుల పేరు సైంటిస్ట్ బి ఉద్యోగాలు
అర్హత సైన్స్ స్ట్రీమ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ అర్హత
అధికారిక వెబ్సైట్https://rac.gov.in/

విభాగాల వారీగా ఖాళీల వివరాలు వివరాలు:

  • డి ఆర్ డి ఓ లో సైంటిస్ట్ బి పోస్టులు : 127 ఉద్యోగాలు
  • ఏబీఏలో సైంటిస్ట్ / ఇంజనీర్ బి పోస్టులు : 9 పోస్టులు
  • ఇతర రక్షణ విభాగాల్లో సైంటిస్ట్ బి పోస్టులు : 12 ఉద్యోగాలు

ఎంత వయసు ఉండాలి:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఈ క్రింది తెలిపిన వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

  • ఓబీసీ అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు
  • దివ్యాంగులకు మరో 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:

డి ఆర్ డి ఓ సైంటిస్ట్ బి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹56,100/- బేసిక్ పే చెల్లిస్తారు. జీతంతో పాటు ఇతర అన్ని రకాల అలివెన్సెస్ ట్రావెల్ ఎలివేన్స్, హెచ్ఆర్ఏ,DA వంటి అలవెన్సెస్ చెల్లించడం జరుగుతుంది.

ఉండవలసిన అర్హతలు:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విడుదలైన సైంటిస్టులు ఉద్యోగాలకు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.
  • పైన తెలిపిన విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు.

కావలసిన సర్టిఫికెట్స్:

  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  • అర్హత సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • రెసిడెన్సి సర్టిఫికెట్
  • గేట్స్ స్కోరు కార్డ్ ఉండాలి

ఎలా అప్లై చేయాలి:

డి ఆర్ డి ఓ ఉద్యోగాలకు పైన తెలిపిన అర్హతలు, వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై ఆన్లైన్ లింక్స్ ద్వారా గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ:20th మే, 2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ :21st జూన్, 2025

Notification PDF

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *